చిన్న జీయర్ స్వామిని కలిసిన కిషన్ రెడ్డి, మై హోమ్ రామేశ్వరరావు

-

హైదరాబాద్ నగర శివారులో ఉన్నటు వంటి ముచ్చింతల్ లో చిన్న జీయర్ స్వామి గారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కలిసారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. ఫిబ్రవరి మాసంలో జరగబోయే రామానుజ శతాబ్ది ఉత్సవాలు కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి.

అయితే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెంట మై హోం అధినేత రామేశ్వరరావు వచ్చారు. ముగ్గురు కలిసి ఏకాంతంగా సుమారు 40 నిమిషాల పాటు సమావేశం కూడా అయినట్లు సమాచారం అందుతోంది.

కాగా తాజాగా చిన్న జీయర్ స్వామిపై కేసు నమోదు చేయాలని నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు చెరుకు లక్ష్మీ ఫిర్యాదు చేశారు. మాంసాహారులపై చిన్న జీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాంసాహారులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news