కారులో ఆ మంత్రులు తోపులే.. చెక్ పెట్టడం కష్టమే!

-

తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక గాలులు వీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకే బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ప్రజలు బీజేపీ వైపు  చూడటం స్టార్ట్ చేశారు. అది దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అయితే టీఆర్ఎస్‌లో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్న లిస్ట్‌లో ఉన్నారు.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

దాదాపు 40 మందిపైనే ఎమ్మెల్యేలు వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. అలాగే 10 మంది మంత్రులు దాకా వ్యతిరేకతని ఎదురుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వారు మళ్ళీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అలాంటి నేతలకు సీట్లు ఇవ్వడానికి కేసీఆర్ కూడా నిరాకరించే అవకాశాలు ఉన్నాయి. అయితే టీఆర్ఎస్‌లో బలమైన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు. వారు సంస్థాగతంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు.

అలాంటి వారికి చెక్ పెట్టడం ప్రతిపక్షాలకు సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. అలా చెక్ పెట్టడం సాధ్యం కాని వారిలో హరీష్ రావు, కేటీఆర్‌లు ముందు వరుసలో ఉంటారని చెప్పాల్సిన పని లేదు. సిద్ధిపేటలో హరీష్‌కు, సిరిసిల్లలో కేటీఆర్‌లని ఓడించడం ప్రతిపక్షాలకు సాధ్యమయ్యే పని కాదు..మళ్ళీ ఈ ఇద్దరు మంత్రుల గెలుపు నల్లేరు మీద నడకే. అలాగే వరుసగా పాలకుర్తిలో సత్తా చాటుతూ వస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చెక్ పెట్టడం కూడా సాధ్యమైన పని కాదని తెలుస్తోంది.

పాలకుర్తిలో అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీజేపీ గానీ వీక్‌గానే ఉన్నాయి. ఇక ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ సైతం స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ వీక్‌గా ఉంది..అసలు బీజేపీకి ఛాన్స్ లేదు. అటు బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డి, సనత్‌నగర్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్‌లు సైతం స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో వీరికి చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news