కరోనాను బ్రిటీష్ వారితో పోలుస్తూ గాలిపటాలు…!

-

మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను కాస్త ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ప్రతీ ఒక్కరు కూడా ఏదోక రూపంలో ప్రజలను మహమ్మారి నుంచి అప్రమత్తం చేస్తున్నారు. ఢిల్లీ ఒక వ్యక్తి కాస్త వినూత్నంగా ఆలోచించి గాలి పటాలు తయారు చేసాడు. ఢిల్లీలోని మొహమ్మద్ తకి అనే వ్యక్తి కరోనా జాగ్రత్తలతో గాలిపటాలను తయారు చేశాడు.

అతన్ని మీడియా పలకరించగా… “మేము బ్రిటిష్ వారిని భారతదేశం నుండి వెంబడించినట్లుగా మరియు స్వాతంత్ర్యం పొందినట్లుగా, ప్రజలు కరోనాను భారతదేశం నుండి వెంబడించటానికి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి అనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను” అని పేర్కొన్నాడు. అంతే కాకుండా స్టే హోం స్టే సేఫ్ అనే నినాదం కూడా వాటిపై ముద్రించాడు అతను. ఈ గాలి పటాలకు ఇప్పుడు ఆ ప్రాంతంలో మంచి డిమాండ్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version