అమెరికా క్రికెట్ లీగ్ లో కేకేఆర్ భారీ పెట్టుబడులు

షారూఖ్ ఖాన్ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) మేజర్ లీగ్ క్రికెట్‌ లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. అమెరికన్ క్రికెట్ భవిష్యత్తుకు ఇది ప్రధాన ప్రోత్సాహకంగా పరిగణించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే ఐపిఎల్‌లో, ట్రినిడాడ్ మరియు టొబాగో (సిపిఎల్) మరియు దక్షిణాఫ్రికాలో ఫ్రాంచైజీని కలిగి ఉంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కి చెందిన ‘ది హండ్రెడ్’ తో చర్చలు జరుపుతున్నారు.

అమెరికన్ క్రికెట్ ఎంటర్ప్రైజెస్ (ఎసిఇ) సహ వ్యవస్థాపకులలో ఒకరైన విజయ్ శ్రీనివాసన్ ఈ ప్రకటన చేసారు. “చాలా సంవత్సరాలుగా, మేము నైట్ రైడర్స్ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాము. యుఎస్‌లో టి 20 క్రికెట్ యొక్క సామర్థ్యాన్ని నిశితంగా గమనిస్తున్నాము. మేజర్ లీగ్ క్రికెట్ దాని ప్రణాళికలను అమలు చేయడానికి అన్ని మార్గాలు ఉన్నాయని మేము నమ్ముతున్నామని ఆయన అన్నారు.