మనీ ట్రాన్స్‌ఫర్‌‌ చేస్తున్నారా? అయితే మీకు ఈ విషయాలు తెలుసా?

-

ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ చేస్తే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏంటో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసేటప్పుడు RTGS గురించి తెలుసుకుందాం. సాధరణంగా ఈరోజుల్లో మనం చాలా వరకు ఆన్‌లైన్‌ పేమెంట్‌లపైనే ఆధారపడుతున్నాం. బ్యాంకింగ్‌ యాప్స్, నెట్‌ బ్యాంకింగ్, అదే విధంగా థర్డ్‌ పార్టీల సేవలపై కూడా ఆధారపడతాం. అంతే కాకుండా బ్యాంకుల RTGS, NEFTద్వారా కూడా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. ఈ రెండింటి మధ్య కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌లో లావాదేవీలు నిర్ధిష్ట సమయంలో బ్యాచ్‌లుగా ప్రాసెస్‌ అవుతాయి. ఆర్‌టీజీఎస్‌లో రోజంతా లావాదేవీలు జరుగుతాయి.

 

ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఈ సేవలను వినియోగదారులు పొందుతారు. సంబంధిత బ్యాంకు మొబైల్‌ యాప్స్‌లో లాగిన్‌ అయి ఆర్‌టీజీఎస్‌ ద్వారా ఫండ్స్ ‌ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలపై వసూలు చేసే ప్రాసెసింగ్‌ ఛార్జీలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రద్దు చేసింది. ఈ విధానంలో ఇన్వర్డ్‌ ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల అవుట్‌వర్డ్‌ ట్రాన్సాక్షన్లపై కేవలం రూ.24.5 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ లావాదేవీలు రూ.5 లక్షలు మించి ఉంటే వాటికి రూ.49.5 వరకు ఛార్జీలు వసూలు చేస్తారు. వీటికి కొన్ని బ్యాంకులు ట్యాక్స్‌ కూడా వసూలు చేస్తున్నాయి. కానీ, ఆర్‌బీఐ నిర్దేశించిన రేట్లకంటే ఎక్కువ ఛార్జీలను వసూలు చేయవు. RTG రెమిటెన్స్ కోసం వినియోగదారులు సంబంధిత బ్యాంకులకు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. రెమిట్‌ చేయాల్సిన మొత్తం, డెబిటింగ్‌ అకౌంట్‌ నంబర్, బ్యాంకు బ్రాంచి, రిసీవింగ్‌ బ్రాంచ్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, లబ్ధిదారుడి పేరు, అకౌంట్‌ నంబర్‌ వివరాలు అందించాల్సి ఉంటుంది.

ఆర్‌టీజీ వల్ల లాభాలు

  • ఈ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసే మార్గాల్లో ఆర్‌టీజీ వల్ల మనకు కొన్ని లాభాలు ఉన్నాయి. మీ లావాదేవీలకు మెరుగైన భద్రత ఉంటుంది.
  • మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసే గరిష్ట మొత్తంపై ఏ విధమైన లిమిట్స్‌ ఉండవు.
  • ఆర్‌టీజీఎస్‌ సేవలు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటుంది.
  • బ్యాంకు చెక్కు లేదా డీడీ అవసరం లేకుండా.. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చేయవచ్చు. అదేవిధంగా లబ్ధిదారుడు డిపాజిట్‌ చేయడానికి బ్యాంకు బ్రాంచికి వెళ్లాల్సిన అవసరం లేదు.
  • దీనిపై వసూలు చేసే ట్రాన్సాక్షన్‌ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. ట్రాన్సాక్షన్లకు చట్టపరమైన రక్షణ కూడా ఉంటుంది. ఈ విధంగా మనీ ట్రాన్స్‌ఫర్‌ సేవలను పొందవచ్చు. వీటి ఛార్జీలు కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version