పెళ్ళిరోజున మేకప్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి..

-

కార్తీకమాసం.. పెళ్ళిళ్ళ సీజన్.. మేకప్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం. అటు పెళ్ళి చేసుకోబోయే వాళ్ళు, ఇటు పెళ్ళిళ్ళకి హాజరయ్యేవారు మేకప్ పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తారు. పెళ్ళి వేడుకలో అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నంలోనే కొన్ని తప్పులు చేస్తుంటారు. అలాంటి తప్పులేవో తెలుసుకుని, పెళ్ళి రోజున ఎలా మేకప్ అవ్వాలి, అసలు ఎన్ని రోజుల ముందు మేకప్ కోసం సిద్ధం అవ్వాలి అనేది తెలుసుకుందాం.

మేకప్ వేసుకోవడం పెళ్ళి రోజుకు మాత్రమే ప్రత్యేకం కాదు. పెళ్ళికి ముందు కనీసం ఒక నెల ముందు నుండైనా మేకప్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, పెళ్ళి రోజున ప్రయోగాల జోలికి అస్సలు వెళ్ళవద్దు. కనీసం ఒక నెల ముందు నుండైనా మేకప్ ట్రయల్స్ చేస్తూ ఉండడం మంచిది. కొత్త ప్రయోగాలకు వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది.

మీ చర్మం రకం ఏమిటో తెలుసుకోండి..

మేకప్ ట్రయల్స్ కి వెళ్లేముందు మీ చర్మం ఎలాంటి రకమో తెలుసుకోవడం ఉత్తమం. ఒకవేళ మీ చర్మం పొడిగా ఉన్నట్టయితే, తేమగా గల సాధనాలను వాడండి.

మేకప్ ట్రయల్స్:

పెళ్ళి వేడుకకి కొద్ది రోజుల ముందే మేకప్ ట్రయల్స్ చేయాలి. మీకేదీ నప్పుతుందో తెలుసుకోవడానికి ఈ ట్రయల్స్ బాగా ఉపయోగపడతాయి.

మేకప్ తీసేసి నిద్రపోవాలి:

ముఖంపై మేకప్ అలాగే ఉంచుకుని నిద్రపోవడం అస్సలు మంచిది కాదు. మీరెంత అలసిపోయినా, మేకప్ వేసుకుని నిద్రపోవద్దు.

సౌకర్యవంతంగా ఉండే మేకప్:

మీరు వేసుకునే మేకప్, మీకు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. మిమ్మల్ని ఏ పనీ చేయనివ్వకుండా ఉండే మేకప్ వేసుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version