రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మీద మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించనున్నట్టు చెబుతున్నారు. ఈనెల 21 వరకు మీడియాతోనూ అలాగే ప్రత్యేక సమావేశాల్లోనూ మాట్లాడవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో కొడాలి నాని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెబుతున్నారు. కోర్టుకు సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని మంత్రి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
నిన్న ఎన్నికల సంఘం కమిషనర్ ను విమర్శించారని చెబుతూ కొడాలి నానికి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే షోకాజ్ నోటీసులలో కొడాలి నాని ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందక పోవడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంత్రి కొడాలి నాని మీద కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించనున్నారు.