హైదరాబాద్‌లో అనుమానాస్పద కేసుగా నమోదైన ఏపీ అసెంబ్లీ మాజీ స్సీకర్ కోడెల మృతిపై దర్యాప్తు జరుగుతోంది. టెక్నికల్ ఆధారాలతో పోలీసులు కేసును చేధిస్తున్నారు. ఆయన సూసైడ్‌కు ముందు ఎవరితోనే 20 నిమిషాలు ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించిన కాల్ డేటాను పరిశీలించారు. తీవ్ర మనోవేదనకు గురైన ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ముందుగా తన పంచెతో ఉరివేసుకోవాలని అనుకున్నప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో కేబుల్ వైరుతో ఉరివేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. 20 రోజులుగా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నట్టు గుర్తించారు. ఘటనపై మరిన్ని విషయాలు ఆరా తీసిన తర్వాతే కేసు విషయం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న కూతురు, భార్య, గన్‌మెన్, డ్రైవర్‌తో పాటు మరో నలుగురిని విచారించారు. ఆత్మహత్యకు ముందు కాల్ డేటా ప్రకారం ఆయన చివరి సారి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ సుమతితో మాట్లాడినట్టు గుర్తించారు. టెక్నికల్ ఆధారాల ద్వారా కేసును పరిష్కరించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.