కోడూరు ఎస్సై ని సస్పెండ్ చేయాలి : హరీశ్ రావు

-

కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం నర్యానాయక్ తండాలో కాంగ్రెస్  నాయకుల దాడికి గురైన బాధిత బీఆర్ఎస్  నాయకులను బెదిరించిన కోడేరు ఎస్సెని సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి టి.హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడి చికిత్స కోసం కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే అక్కడ కూడా కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి, కారు ధ్వంసం
చేశారని హరీష్ రావు ఎక్స్ వేదికగా వెల్లడించారు.

ప్రభుత్వ ఆస్పత్రిలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే దాడి చేసిన వారి వివరాలు బయటకు వస్తాయని..ఆ
సీసీ కెమెరాలు స్థానిక పోలీస్ స్టేషన్ కు అనుసంధానంగా ఉన్నాయని తెలిపారు. ఉదయం దాడి జరిగిన వెంటనే కోడేరు ఎస్సైకి ఫిర్యాదు చేస్తే తిరిగి బాధితుడినే బెదిరించారన్నారు. కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మారణాయుధాలతో దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని, వాటిని వెంటనే బయట పెట్టాలన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news