ఆసియా కప్ లో భాగంగా నిన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై 101 పరుగులు తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో 61 బంధువుల్లోనే విరాట్ కోహ్లీ 122 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. దాదాపు మూడేళ్ల తర్వాత నమోదు చేసిన ఈ సెంచరీ లో 6 సిక్సర్లు మరియు 12 ఫోర్లు ఉన్నాయి. దీంతో మునుపటి కోహ్లీ గుర్తు చేశాడు. ఈ సెంచరీ తో మూడు రికార్డులను తన పేరు లిఖిoచుకున్నాడు కోహ్లీ.
అంతర్జాతీయ టి20 క్రికెట్ లో టీం మీడియా ఆటగాళ్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ను నమోదు చేశాడు. 122 పరుగులతో కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా రోహిత్ శర్మ 118 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక టి20 క్రికెట్ లో కోహ్లీకి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇప్పటివరకు ఐపీఎల్ 2016 సీజన్ లో 113 పరుగుల స్కోర్ కే కోహ్లీకి అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా ఉండేది. ఆ రికార్డులు ఆఫ్ఘనిస్తాన్ పై మ్యాచ్లో తిరగరాశాడు. అలాగే అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా ఉన్నాడు.