స్టేజ్‌ మీద నాట్యం చేస్తూనే.. గుండెపోటుతో కుప్పుకూలిన యువకుడు..! వీడియో వైరల్‌..

-

జీవితం చాలా చిన్నది.. ఎప్పుడు ఏది అనిపిస్తే..అప్పుడు అది చేసేయాలి..లైఫ్‌ను మరీ అంత సీరియస్‌గా తీసుకోవద్దని మేధావులు చెప్తారు.. ఒక్కోసారి అది నిజమే అనిపిస్తుంది.. ఏవేవో చేయాలని ఎన్నో కలలు కంటూ.. ఉన్న టైమ్‌ను ఎలాంటి సంతోషాలు లేకుండా బతికేవాళ్లను చూస్తే జాలి వేస్తుంది. ఎవరికి తెలుసు రేపు ఉంటామో లేదో..దానికోసం.. ఎందుకు అంత హైరానా..ఇప్పుడున్న లైఫ్‌స్టైల్‌కు ఎప్పుడు ఏ రోగం వస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు..అప్పటివరకూ ప్రసంగిస్తూనే.. సడన్‌గా కుప్పకూలి చనిపోతున్నారు..స్టేజ్‌ మీద నాట్యం చేస్తూ.. అలానే హాట్ఎటాక్‌తో చనిపోయిన ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియో చూస్తే.. ఒక్కసారిగా మనకు మన జీవితం ఎంత చిన్నదో అనిపిస్తుంది. అసలు చావు ఇంత తేలిగ్గా వచ్చేస్తుందా అని వణుకుపుడుతుంది కూడా..! ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

జమ్మూలోని బిష్నా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో యోగేశ్‌ గుప్తా (20) అనే కళాకారుడు పార్వతీదేవి వేషధారణలో నృత్యం చేశాడు. నృత్యం చేస్తూనే..స్టేజ్‌ మీద కుప్పకూలిపోయాడు. అక్కడున్న వారంతా నృత్యం చేస్తున్నాడనుకోని.. అతని వద్దకు వెళ్లలేదు.కొద్ది క్షణాలైన లేవకపోయేసరికి.. శివుడి వేషధారణలో ఉన్న మరో వ్యక్తి యోగేశ్‌ను లేపేందుకు వెళ్లాడు. ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

గుండెపోటు కారణంగా యోగేశ్‌ అప్పటికే మృతి చెందినట్లుు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం అని అందుకే వైద్యులు ఎప్పుడూ చెప్పేది. ఒత్తిడి, అన్‌హెల్తీ లైఫ్‌స్టైల్‌ వెరసి గుప్పుడెంత గుండెకు ఉప్పెనంత కష్టం తెచ్చిపెడుతున్నాయి. ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు కానీ.. ఎప్పుడూ చెడు అలవాట్లతో సావాసం చేస్తే..ఆరోగ్యం విడాకులిచ్చేస్తుంది. వీలైనంత వరకూ కూల్‌గా ఉండేందుకు ప్రయత్నించండి. ఎందుకు అంత కంగారు, టెన్షన్.. మీరు టెన్షన్‌ పడినంత మాత్రానా.. జరిగేది జరగకుండా ఆగదు.. చాలామంది తమ చేతుల్లో లేనివాటికి కూడా ఊకే..ఫీల్‌ అవుతారు. జీవితాన్ని వీలైనంత వరకూ ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నించండి చాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version