కోహ్లి ఒక లెజెండ్‌.. అతడిని మించిన క్రికెటర్‌ మరొకడు లేడు:

-

ఇంటర్నేషనల్ టీ20ల్లో విరాట్ కోహ్లి ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై విజయం అనంతరం పొట్టి క్రికెట్‌కు కింగ్ విరాట్ కోహ్లి విడ్కోలు పలికాడు.ఇక సౌత్ ఆఫ్రికా తో జరిగిన టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తన ప్రదర్శనగాను కోహ్లి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లిపై పాక్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో కోహ్లికి మించిన క్రికెటర్‌ మరొకడు లేడని షెహజాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

“విరాట్‌ ఒక లెజెండ్‌. మా తరంలో అతడిని మించిన క్రికెటర్‌ మరొకడు లేడు. విరాట్‌ కోహ్లీ తన టీ20 కెరీర్‌ను ఘనంగా ముగించాడు. తన కెరీరంతటా కోహ్లి అద్బుతంగా ఆడాడు. ఆఖరికి చివరి మ్యాచ్‌లో కూడా కోహ్లి అదరగొట్టాడు అని అన్నారు.అది విరాట్‌ కోహ్లి బ్రాండ్‌. ఫైనల్లో తన సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కడితే.. విరాట్‌ మాత్రం బౌండరీల వర్షం కురిపించాడు. అందుకే విరాట్‌ను మించిన వాడు లేడని నేను పదేపదే చెబుతున్నాను అని తెలిపారు. విరాట్‌ను గతంలో చాలా మంది బాబర్‌ ఆజంతో పోల్చారు. కానీ అది సరికాదు. విరాట్‌కు ఎవరూ సాటిరారు. కోహ్లి ఐసీసీ టోర్నమెంట్లలో అద్భుతమైన స్ట్రైక్ రేట్ , యావరేజ్ కలిగి ఉన్నాడు. వరల్డ్‌ క్రికెట్‌లో ఒకే ఒక్క విరాట్‌ కోహ్లి ఉంటాడని” షెహజాద్ అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news