కాంగ్రెస్ ఉద్ధరించకుండా ఉద్దెర మాటలు మాట్లాడుతోంది : హరీష్ రావు

-

దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌లో జరిగిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎంతో పోరాడి, ఎన్నో త్యాగాలమీద కేసీఆర్ తెలంగాణను సాధించాడు.. పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించాడు.. కాంగ్రెస్ నాలుగు నెలల్లో వెనక్కి తీసుకెళ్లింది అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఫేక్ వార్తలు, లీక్ వార్తలను నమ్ముకుని రాజ్యం నడుపుతోంది. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత యువతపై ఉంది అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలనే నమ్ముకున్నాయి.. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదు అని మండిపడ్డారు .నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతులను ప్రాణాలు తీసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది. 20 కోట్లు ఉద్యోగాలు ఇవ్వలేదు, నల్లధనం వెనక్కి తీసుకురాలేదు.వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని బాండు రాసిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతోంది. కాంగ్రెస్ ఉద్ధరించకుండా ఉద్దెర మాటలు మాట్లాడుతోంది అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news