నకిరేకల్ అభ్యర్థిని పార్టీ అధిష్టానమే ఖరారు చేస్తుంది : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

-

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని అధికారంలోకి రావాలని ఆయా పార్టీలో అగ్రనేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు నకిరేకల్ కాంగ్రెస్‌ నేతలతో కీలక నేత, భువనగిరి ఎంపీ వెంకట్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నకిరేకల్ అభ్యర్థిని పార్టీ అధిష్టానమే ఖరారు చేస్తుందని అన్నారు. స్థానిక నేత, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీ మారాలని చూస్తున్నారని.. అందుకే నకిరేకల్ టికెట్ ఎవరికి ఇవ్వాలనేదానిపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ నుంచి చిరుమర్తి లింగయ్యను రెండుసార్లు గెలిపిస్తే పార్టీని నట్టేట ముంచి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, బీఆర్ఎస్ నుంచి నకిరేకల్ టికెట్ ఆశించిన వేముల వీరేశానికి అధిష్టానం భారీ షాకిచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన చిరుమర్తి లింగయ్యనే ఖరారు చేసింది. వేముల వీరేశం రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఈ క్రమంలో వేముల వీరేశం కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నట్లు వార్తలు విస్తృతం అయ్యాయి. ఈ క్రమంలో నియోజకవర్గ నేతలతో ఎంపీ కోమటిరెడ్డి సమావేశం అయ్యి అభిప్రాయాలు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version