టికెట్ నాదే.. గెలుపు నాదే: కోన రఘుపతి

-

వచ్చే పుకార్లు రాసే వార్తలు నమ్మద్దని ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే అని ఈసారి గెలిచేది నేనే హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని కోన రఘుపతి అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి టిడిపి అధినేత చంద్రబాబు కి మధ్య జరుగుతున్న ఎన్నికలు ప్రజలు మరోసారి వైయస్ జగన్ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని.. సిద్ధం సభ ద్వారా స్పష్టం చేశారని బాపట్ల వైసిపి ఎమ్మెల్యే కోన రఘుపతి చెప్పారు.

సిద్ధం సభకి 14,000 మంది బాపట్ల నుండి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తున్నారు అని పుకార్లు, షికార్లు చేస్తున్నాయని కొంతమంది కావాలని సృష్టిస్తున్నారని ప్రజలు పట్టించుకోవద్దని ఎమ్మెల్యే కోన రఘుపతి చెప్పారు రఘుపతిని మార్చివేస్తున్నారని కొన్ని పత్రికల్లో రావడం అలానే కొంతమంది కావాలని పని కట్టుకుని తిరుగుతున్నారని అవి ఏమీ పట్టించుకోవద్దని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news