తల్లి లాంటి భువనేశ్వరికి అవమానం జరిగితే కేటీఆర్ స్పందించకపోవడం బాధాకరం: కొండా సురేఖ

అసెంబ్లీలో తన సతీమణి పై అసభ్య పదజాలం వాడారంటూ మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కంటతడి పెట్టడం తో అధికార పార్టీనేతల పై పలువురు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఉరుం ఉరిమి మంగళం మీద పడ్డట్టు చంద్రబాబును అంటే కేటీఆర్ ఎందుకు స్పందించలేదు అంటూ కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ వ్యాఖ్యానించారు.

ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కవిత స్పందించకపోవడం విచారకరం అని అన్నారు. తల్లి లాంటి మహిళకు అవమానం జరిగినా కేటీఆర్ కనీసం స్పందించకపోవడం బాధాకరం అని అన్నారు. ఆఖరికి ట్విట్టర్ లో కూడా ఖండించలేదు అని అన్నారు. ఈ అంశంలో రోజా లక్ష్మి పార్వతి స్పందించిన తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. సాటి మహిళకు అవమానం జరిగిన వేళ రోజా శాపనార్థాలు పెట్టడం సరి కాదని హితవు పలికారు. లక్ష్మీ పార్వతి మాటలు విన్నతరవత ఆమె పై ఉన్న కాస్త గౌరవం కూడా పోయిందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు.