పూనమ్ కౌర్ – రాహుల్ ఎపిసోడ్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర చేయని దిక్కుమాలిన పార్టీ ఒక బీజేపీ మాత్రమేనని.. పాదయాత్రలు చేస్తే జనంతో ఎలా ఉండాలో తెలుస్తుందని చురకలు అంటించారు. పూనమ్ కౌర్ చేయి రాహుల్ కావాలని పట్టుకోలేదని.. తప్పులుంటే వేలెత్తి చూపెట్టాలి గాని చిల్లర ప్రయత్నాలు బిజెపి మానుకోవాలని హెచ్చరించారు కొండా సురేఖ.
కాంగ్రెస్ మహిళలను గౌరవిస్తుందని..ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ వరకు మహిళలని గౌరవించే పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. ఆడవాళ్లను తల్లిలాగ చూసే పార్టీ కాంగ్రెస్ అని.. బిజెపి నేతల తప్పుడు ప్రచారం వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాయని పేర్కొన్నారు. పార్టీ నాయకులని బతిమిలాడే పరిస్థితి ఇప్పుడు లేదని.. వస్తే వచ్చారు. పోతే పోయారు అనుకుంటుందన్నారు. వెంకటరెడ్డి తప్పు చేస్తే వెంటనే నోటిస్ ఇచ్చారు.. పార్టీ ఒకప్పటిలాగా లేదు.. నాయకులు అంతా కలిసి పని చేస్తున్నారన్నారు కొండా సురేఖ.