గ్యాస్ సిలెండర్ ధరలు మొదలు… ఎలక్ట్రిసిటీ సబ్సిడీ వరకు నవంబర్ ఒకటి నుండి మారనున్న అంశాలివే..!

-

ప్రతీ నెలా ఒకటో తేదీ వస్తే చాలు చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఇక రేపు నవంబర్ ఒకటవ తారీకు. ఈ నెలలో కూడా ఎప్పటిలానే కొన్ని మార్పులు జరుగుతున్నాయి. అయితే మరి ఈ నెల లో ఎలాంటి అంశాలు మారుతున్నాయనేది చూద్దాం.

కెవైసి:

బీమా కోసం క్లెయిమ్ చేసేటప్పుడు KYC పత్రాలను తప్పనిసరిగా సబ్మిట్ చేయాలట. అయితే జీవిత బీమా కాకుండా ఇతర పాలసీని కొనుగోలు చేసినప్పుడు కూడా కెవైసి డీటెయిల్స్ ఉంటాయి. రూ. 1 లక్ష లేదా దాని కంటే ఎక్కువ బీమా క్లెయిమ్‌లకు అడ్రెస్ అవసరం. అలానే గుర్తింపు రుజువు వంటి KYC పత్రాలు కావాలి. కెవైసి డీటెయిల్స్ ని కూడా ఇప్పుడు తప్పనిసరి చేయాలని రెగ్యులేటర్ నిర్ణయించింది. KYC డాక్యుమెంట్స్ సమర్పించకపోతే క్లెయిమ్ రిజక్ట్ అవుతుంది.

గ్యాస్ ధరలు:

గ్యాస్ ధరలలో కూడా మార్పు వచ్చింది. ప్రతి నెలా ఒకటో తేదీన సవరిస్తుంటాయి. ఇప్పుడు కూడా ధరల్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తాయి. లేదంటే అలానే ఉండచ్చు. ఈ మధ్యన అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగాయి. అప్పుడు సిలిండర్ల ధరలు కూడా పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఎలక్ట్రిసిటీ సబ్సిడీ:

దేశ రాజధాని దిల్లీలో ఎలక్ట్రిసిటీ సబ్సిడీకి సంబంధించి కొత్త రూల్స్ ని తెచ్చారు. ఇప్పటి వరకు ఎవరైతే సబ్సిడీ కోసం రిజిస్టర్ చేసుకోరో వాళ్లకి నవంబర్ 1 నుంచి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ రాదుట. 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఢిల్లీలో ఇస్తున్నారు. అక్టోబర్ 31లోపు చేసుకోని వారు ఉచిత విద్యుత్తు ని పొందలేరు.

ట్రైన్ టైమింగ్స్:

ఇప్పుడు టైమ్ టేబుల్ వచ్చింది. దీని ప్రకారం పలు ట్రైన్ల సమయాల్లో మార్పులు చేసారు. కనుక తప్పని సరిగా ప్రయాణికులు చూసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news