తెలంగాణ కాంగ్రెస్ కి మరో షాక్ తగిలింది. పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ఆయన తన అనుచరులకు ఫోన్లు చేసి సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఈరోజు రేపు ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది.
నిజానికి ముందే పార్టీ వీడాలని అనుకున్నా తన నిర్ణయం ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన చిన్నారెడ్డి మీద పడకూడదని తను ఎన్నికలు అయ్యేదాకా ఆగినట్టు పేర్కొన్నారు. ఇక గతంలో టీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచిన ఆయన ఆయన ముందస్తు ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేరారు. అక్కడ నుండి 2019 ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా పోటీ చేసి స్వల్ప మార్జిన్ తో ఓడిపోయారు.