రాష్ట్ర ప్రభుత్వం ఒకే వర్గానికి కొమ్ము కాస్తూ.. హిందువులని హింసిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. బైంసాలో మానవ హక్కుల ఉల్లంఘన , రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందన్న ఆయన పోలీసులను ఎంఐఎం చెప్పు చేతల్లో పెట్టిందని అన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే శాంతి భద్రతల సమస్య గా మారుతుంది అని గవర్నర్ కి చెప్పామని మహారాష్ట్ర నుండి బహిష్కరించి బడిన లుచ్చాలు బైంసా లో ఉన్నారని అన్నారు.
మానవత్వం లేని మానవ మృగం సీఎం కేసీఆర్ అని పేర్కొన్న ఆయన ఒక పసిపాప మీద అత్యాచారం జరిగితే సీఎం ,కాంగ్రెస్, కమ్యూనిస్టు లు స్పందించరా అని ప్రశ్నించారు. సీఎం నీకు కుటుంబం ఉంది.. ఇదే పరిస్థితి ని కుటుంబం కి జరిగితే ఎలా ఉంటుంది ఆలోచించుకోమని అన్నారు. ప్రగతి భవన్ లో కి మా కార్యకర్తలు ,నేను చొరబడతాం… సీఎం ని గల్లా పట్టుకొని బయటకు పట్టుకు వస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందువులు నీకు ఓటు వేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం పై నమ్మకం లేకనే గవర్నర్ తలుపు తట్టామమో అన్నారు.