బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఘాటు గా స్పందించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. చట్టాల మీద, వ్యవస్థ మీద బండి సంజయ్ కి నమ్మకం లేదన్నారు. బండి సంజయ్ అసహనంతో మాట్లాడుతున్నారని.. అడ్డంగా దొరికినా బుకాయింపులు చేస్తున్నారని ఆరోపించారు. నీకు సంబంధం లేని విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు..? అని ప్రశ్నించారు.
డిల్లీ డిల్ కు నువ్వేందుకు ప్రమాణాలు చేస్తున్నావు..? నీకు ధైర్యం, దమ్ము ఉంటే మోదీతో ప్రమాణం చేయించూ అని సవాల్ విసిరారు. మీకు భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదని.. కేవలం మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో.. కమ్యూనిస్టు పార్టీలు వేల కోట్లు తీసుకున్నారని అబద్దాలు ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపిని గద్దె దించేందుకే మీము లౌకిక శక్తులతో పోరాటం చేసేందుకు కలిశామన్నారు. బండి సంజయ్.. నీకు దమ్ము ఉంటే రాజ్యాంగం పై ప్రమాణం చేయ్ ? అని సవాల్ విసిరారు.