ఈ రోజు నెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కార్యకర్తలతో మీడియా సమావేశంలో పాల్గొని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ.. నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి లాగా నాకు నమ్ముకున్న పార్టీకి మోసం చేయడమా రాదని ఆయనపై సెటైర్లు వేశాడు. ఆ రోజు రాష్ట్రము అంతటా ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసుకుంటుండగా టీడీపీలో కొనసాగుతున్న ఈ పెద్దమనిషి ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ బి ఫార్మ్ తీసుకోవడానికి హైద్రాబాద్ వెళుతున్నా అని చెప్పి, యు టర్న్ తీసుకుని జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లి వైసీపీ బి ఫార్మ్ తీసుకున్న నమ్మక ద్రోహి అంటూ విమర్శించాడు కోటంరెడ్డి. ఇలాంటి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు కూడా నాపై విమర్శలు చేయడం తగదు అంటూ ఆదాలను ఉద్దేశించి మాట్లాడాడు.
కాగా 2024 ఎన్నికల్లో నెల్లూరు రురల్ నుండి వైసీపీ తరపున ఆదాల మరియు టీడీపీ తరపున కోటంరెడ్డి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కోటంరెడ్డి ఆదాలపై చేసిన ఈ తరహా వ్యాఖ్యలపై ఆదాల స్పందిస్తారా చూడాలి.