కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచంలో అన్ని రంగాలకు చాలా గట్టిగా తాకింది. ప్రపంచంలో దాదాపు దేశాలు అన్ని లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో… అన్ని ఇల్లు ఇప్పుడు సినిమా హాలు, పార్కు, ఆఫీస్ గా మారిపోయాయి. పనులు లేక ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో.. లాక్ డౌన్ చాలా పటిష్టంగా అమలవుతోంది. దీంతో కరోనా ప్రభావం ఇప్పుడు మీడియా రంగంపై కూడా గట్టిగానే పడింది. రాజకీయ నాయకులు అంతా ఇళ్లకే పరిమితం కావడంతో వార్తలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవటంతో ప్రస్తుతం మీడియా ఫోకస్ అంతా కరోనా వైరస్ పైనే పడింది.దీంతో అన్ని రాష్ట్రలలో కల్లా రాజకీయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే తెలుగు మీడియా రంగం కూడా కరోనా వైరస్ వార్తల పైనే పూర్తిగా దృష్టి పెట్టింది. మామూలుగా అయితే తెలుగు మీడియా రంగం చాలా డిఫరెంట్ అని ఇక్కడ రాజకీయాలను వార్తాపత్రికలు శాసిస్తాయి అని బయట రాష్ట్రాలకు చెందిన నాయకులు ప్రముఖులు అంటుంటారు. దీంతో ఆయా వార్తా పత్రికలో వచ్చే రాజకీయాలకు సంబంధించిన వార్తలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజలు మజా చేస్తుంటారు.
అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ తో తెలుగు వార్తా పత్రికలు ఆ వైరస్ నుండి బయటపడేందుకు ఉన్న మార్గాలు వంటి విషయాలనే హైలెట్ చేస్తున్నాయి. దీంతో పొలిటికల్ ఫీడింగ్ తగ్గిపోయింది. కొసమెరుపు ఏంటంటే.. జగన్ వ్యతిరేక వార్తలను వడ్డి వార్చే ఆంధ్రజ్యోతిలో ఆ పత్రిక ఎండీ ఆర్కే స్వయంగా రాసే… వారం వారం వచ్చే కొత్త పలుకు ఈ వారం రాకపోవడం గమనార్హం. కరోనా వైరస్ రాకతో చాలా పత్రికలు పేజీలను తగ్గించాయి. ఆర్థికంగా అనేక కష్టాలు ఎదురు అవుతున్న నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ఆర్కే కొత్త పలుకు కూడా ఉలుకు పలుకు లేకుండా పోయింది.