కృష్ణంరాజు సూపర్ హిట్ డైలాగ్స్, సాంగ్స్ ఇవే!

-

కృష్ణం రాజు దాదాపు 180 సినిమాల్లో నటించారు. ‘డ్యూయెట్లు పాడితేనే, ఫైట్లు చేస్తేనే, భారీ డైలాగులు చెప్తేనే హీరో కాదు’ అని ఫీలయ్యే నటుడాయన. ప్రేక్షకులకు వినోదం అందించారు. అయితే ఆయన సినిమాల్లో కొన్ని సూపర్ హిట్ డైలాగ్స్, సాంగ్స్ గురించి తెలుసుకుందాం…

కృష్ణంరాజు పేల్చిన కొన్ని డైలాగులు..

  • జానకీ కత్తి అందుకో జానకీ
  •   రంగూన్ బచ్చాను కాదు బే రంగూన్‌ రౌడీని
  • నేను గాంధీనా, నెహ్రూనా పేరు చెప్పగానే తెలియడానికి
  • మన నీడను మనం వేరుచేసుకోవడం ఎంత కష్టమో మన బంధాలను దూరం చేసుకోవడం అంతే కష్టమ్
  • నాకొచ్చే డబ్బుల కోసం నేను పనిచేయట్లేదు. నేను చేసే పనికి డబ్బులొస్తున్నాయి
  •  సైకిల్‌, కారు, విమానం.. ఏది ఎక్కినా దిగాల్సింది నేల మీదే, నడవాల్సింది కాళ్లతోనే

చిరస్థాయిగా నిలిచే పాటలు..

  • రాయిని ఆడది చేసిన రాముడివా (త్రిశూలం)
  • పెళ్లంటే పందిళ్లు (త్రిశూలం)
  • అభినందన మందారమాల (తాండ్ర పాపారాయుడు)
  • శివ శివ శంకరా (భక్త కన్నప్ప)
  • ఆకాశం దించాలా (భక్త కన్నప్ప)
  • కళ్లలోన నీవే (సింహస్వప్నం)
  • ముద్దబంతి పువ్వమ్మా (రగిలే జ్వాల)

ప్రముఖ నటుడు కృష్ణంరాజు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version