VIRAL : అరబిక్ కుతు సాంగ్ కు స్టెప్పులు ఇరగదీసిన కృతి శెట్టి

-

కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘ బీస్ట్’ సినిమాలోని ‘అరబిక్ కుతు’ సాంగ్ యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది ఈ సాంగ్. అయితే ఈ పాటకు.. వరుసగా హీరోయిన్లు కూడా స్టెప్పులు వేస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ సమంత, రష్మిక మందన్న , కీర్తి సురేష్ స్టెప్పులు వేయగా.. తాజాగా… కృతి శెట్టి ఈ పాటకు డాన్స్ చేసి.. అందరినీ ఆశ్చర్య పరిచింది.

అచ్చం పూజా హెగ్డే లా స్టెప్పులు వేసి అందరినీ మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కాగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లో విజయ్, పూజా హెగ్డే సూపర్ డ్యాన్స్ తో అదరగొట్టారు. దీనికి తోడు యంగ్ సెన్సెషన్ అనిరుధ్ మ్యూజిక్ దుమ్మురేపింది. అనిరుధ్, జోనితా గాంధీ పాడిన ఈ పాటకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ కి లిరిక్స్ ని తమిళ ప్రముఖ హీరో శివకార్తికేయన్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news