సాగర్ కుడికాల్వ నుంచి నీటివాడకం ఆపండి.. ఏపీకి కేఆర్‌ఎంబీ లేఖ

-

ఏపీ ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. నాగార్జున సాగర్ కుడికాల్వ నుంచి నీటి వాడకం ఆపాలని మరోసారి కోరింది. ఈ మేరకు పీ జల వనరుల శాఖ ఈఎన్సీకి రాసిన లేఖలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే.. వాటాకు మించి నీరు వాడుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసినట్లు బోర్డు పేర్కొంది.

సాగర్ కుడికాల్వ నుంచి మార్చ్‌ పదో తేదీ నాటికే 11 టీఎంసీలకు పైగా వాడుకున్నట్లు కేఆర్ఎంబీ తెలిపింది. ఏపీ వాటాకు మించి నీరు వాడుకుంటే.. తెలంగాణలోని 8లక్షల ఎకరాల పంటలు, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు తాగునీటికి సమస్య ఏర్పడుతుందని తెలంగాణ ఈఎన్సీ ఆందోళన వ్యక్తం చేసినట్లు బోర్డు పేర్కొంది. నీటి వాడకం ఆపాలని ఇప్పటికే రెండుమార్లు ఆంధ్రప్రదేశ్‌ను కృష్ణా బోర్డు కోరింది. ఈ మేరకు తాజాగా మళ్లీ లేఖ రాసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version