కృష్ణా రివర్ బోర్డ్ సమావేశంలో సాంకేతిక సమస్య.. ఎటూ తేల్చకుండానే ముగింపు ?

-

ఎటూ తేల్చకుండానే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ముగిసింది. కేఆర్ఎంబీ సమావేశంలో సాంకేతిక సమస్య ఎదురయింది. దీంతో ఏమీ తేలకుండానే సమావేశం వాయిదా పడింది. బోర్డు మెంబర్ సెక్రటరీ రాయపురే అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. సాంకేతిక సమస్య ఎదురవడంతో ఈ నెల చివర్లో మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే ఏపీ తన కోటా కంటే ఎక్కువ నీటిని వాడుకుందని బోర్డు దృష్టికి తెలంగాణ తీసుకువెళ్లినట్టు సమాచారం. వేసవి నీటి అవసరాలతో పాటు గడిచిన మూడు నెలల్లో నీటి వాటాల వినియోగంపై చర్చించనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నుంచి 14 టీఎంసీల నీటిని తమకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. కృష్ణా రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. కరోనా కారణంగా జలసౌధ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు వెబినార్‌‌ లో పాల్గొంటారు.  

Read more RELATED
Recommended to you

Latest news