మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల ఫైర్ అవుతున్నారు. తాజాగా కేటీఆర్ ఓ కార్యక్రమంలో ఏపీలో రోడ్లు బాగా లేవని, కరెంట్ ఉండటం లేదు, నీళ్లు లేవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఫ్రెండ్ కేటీఆర్ కు ఫోన్ చేసి చెప్పారని.. కానీ నేను హైదరాబాద్ లో ఉండి వచ్చానని.. కరెంట్ లేక జనరేటర్ వాడాల్సి వచ్చిందని బొత్స అన్నాడు.
హైదరాబాద్ లోనే కరెంట్ లేదు… కేటీఆర్ ఏపీ వస్తే రోడ్లు ఎలా ఉన్నాయో చూపిస్తా… మంత్రి బొత్స కౌంటర్
-