హైదరాబాద్‌కు చెందిన ఎన్జీవో ‘హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ’ చిన్నారులతో బుధవారం కేటీఆర్ దీపావళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన అనుభూతులను కేటీఆర్ పంచుకున్నారు…ఇందులో భాగంగా ‘చాలా కాలం తర్వాత బెస్ట్ దీపావళి జరుపుకొన్నానని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చిన్నారులతో కలిసి దిగిన ఫొటోలను ఆయన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. నా తరఫు నుంచి వాళ్లకు సహాయం చేస్తానని హామీ ఇచ్చాను. వారికి ప్రస్తుతం అవసరాల కోసం రూ.12లక్షల చెక్కు ఇచ్చాను. దయచేసి మీరు కూడా సహాయం చెయ్యండి’ అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కోరారు. సంతోషంగా పిల్లలతో మాట్లాడుతూ వారితో గడిపారు. ఈ సందర్భంగా వారికి చెక్లెట్ల ప్యాకెట్ ను బహుమతిగా అందించారు.
Best Diwali in a long time. Got to spend a few minutes with the beautiful children from Helping Hands Humanity?
Promised them support from my side & handed over a cheque of ₹12 lakhs that should take care of their basic expenses for an year
Request you all to support them ? pic.twitter.com/HrPF4O4UY3
— KTR (@KTRTRS) November 7, 2018