పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో నిలిచింది. 2017-18లో 14,012.81 వేల మెట్రిక్ టన్నుల పండ్ల ఉత్పత్తితో దేశం మొత్తం ఉత్పత్తిలో 15% ఆంధ్రప్రదేశ్ నుంచే జరగడంతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. వ్యవసాయ శాఖకు చెందిన హార్టికల్చర్ స్టాటిస్టిక్స్ డివిజన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం… ఏటా అగ్ర స్థానంలో నిలిచే మహారాష్ట్ర, యూపీ రాష్ట్రాలు ఈసారి వరసగా 10,609.36 వేల మెట్రిక్ టన్నులు, 10,521.77 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో వరసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి.
9,026.79 వేల మెట్రిక్ టన్నులతో గుజరాత్ నాలుగో స్థానంలో నిలవగా.. 7,402.73 వేల మెట్రిక్ టన్నులతో మధ్యప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ 1,755.70 వేల మెట్రిక్ టన్నుల పండ్ల ఉత్పత్తి జరిగింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు పంచుకుంటూ… ఉద్యానవన పంటలపై ప్రభుత్వ పెట్టిన ప్రత్యేక శద్ధ వల్లనే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
పండ్ల ఉత్పత్తిలో సంప్రదాయకంగా అగ్రస్థానంలో ఉండే యూపీ, మహారాష్ట్రలను వెనక్కినెట్టి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడింది. 2017-18 సంవత్సరంలో దేశం మొత్తం ఉత్పత్తిలో 15% ఏపీ నుండే జరిగింది. ఉద్యానపంటలపై ప్రభుత్వం పెట్టిన ప్రత్యేక శ్రద్ధ వల్లే ఇది సాధ్యమైంది. pic.twitter.com/ncaOTXI2PO
— N Chandrababu Naidu (@ncbn) November 7, 2018