కేసీఆర్ దెబ్బంటే అట్లుంటది.. ఎవరైనా దిగిరావాల్సిందే : కేటీఆర్

-

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునే విషయంలో బీఆర్​ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి చిత్తుశుద్ధిని చాటారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఒక్క మాట మాట్లాడితే ఎవరైనా దిగి రావాల్సిందేనని మరోసారి రుజువైందని తెలిపారు. అదానీకి బైలదిల్లా ఇనుప ఖనిజ గనుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత వైఖరిని బయటపెట్టినందుకే కేంద్రం కొత్త నాటకానికి తెరతీసిందని కేటీఆర్ విమర్శించారు.

అదానీకి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని బైలదిల్లా గనుల అక్రమ కేటాయింపుల నుంచి దృష్టి మరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని ఆరోపించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తీరుగా… విశాఖ ఉక్కు పరిశ్రమ, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పాతర వేసేలా కేంద్రం కుట్రలు చేసిన తీరును బీఆర్​ఎస్ నిరంతరం లేవనెత్తుతుందని స్పష్టం చేశారు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టులో పాల్గొంటామన్న ఒక్క ప్రకటనతో కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. విశాఖ ఉక్కుపరిశ్రమ నిర్ణయాన్ని పూర్తిగా విరమించడంతో పాటు.. బయ్యారం స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసే వరకూ కేంద్రంపై నిరంతరం ఒత్తిడి పెంచుతూనే ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version