రేవంత్ రెడ్డి ప్రధాని మోడీల మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శనివారం సిరిసిల్లలో నిర్వహించిన రైతు దీక్షలో మాట్లాడారు. సీఎం గుంపు మేస్త్రి అని ప్రధాని తాపీ మేస్త్రి అని వీళ్ళు ఇద్దరూ కలిసి తెలంగాణకి సమాధి కట్టాలని చూస్తున్నారని అన్నారు. ఇదే వీళ్ళ ప్లాన్ అని అన్నారు కేటీఆర్.
వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణ గొంతుని నొక్కేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ ని ఖతం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు తరఫున కొట్లాడుదామా వీళ్ళ కుట్రలకి బలవుదామా అని కార్యకర్తలని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు రైతుల తరఫున రేపటినుండి బయలుదేరుదాం అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.