దేశంలోనే విజయవంతమైన స్టార్టప్​గా తెలంగాణ : కేటీఆర్

-

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఇవాళ నిజామాబాద్​లో పర్యటించారు. అక్కడ కాకతీయ సాండ్ బాక్స్ డెవలప్‌మెంట్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ అండ్ స్కేల్ అనే అంశంపై మాట్లాడారు. దేశంలోనే విజయవంతమైన స్టార్టప్‌గా తెలంగాణ నిలిచిందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద నీటి పారుదల ప్రాజెక్టు నాలుగేళ్లలో నిర్మించామని.. లక్ష కి.మీ.ల పైప్‌లైన్ వేసి కోటి ఇళ్లకు మంచి నీరు అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఐటీ పరిశ్రమ విస్తరించామని కేటీఆర్‌ పేర్కొన్నారు.

‘ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.లక్షా 18వేల కోట్లకు పెరిగింది. దేశంలో రాజకీయాల వల్ల ఎకానమీలో వృద్ధి చెందడం లేదు. 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది విమర్శలు చేశారు
కేసీఆర్‌ అధికారం చేపట్టాక 24 గంటలు విద్యుత్‌ సరఫరా ఇస్తున్నాం’ అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version