తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ప్రసంగం పై కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌లాగా ఉందని చురకలు అంటించారు. గత 15 నెలల అట్టర్‌ప్లాప్ పాలనపై ప్రాయశ్చిత్తం ఉంటుందని అనుకున్నామన్నారు కేటీఆర్. రేవంత్ చేతకానితనం వల్ల తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని విమర్శలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో 30 శాతానికి మించి రుణమాఫీ జరగలేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే. 20 శాతం కమీషన్ తప్ప.. విజన్ లేని ప్రభుత్వం ఇది. కేసీఆర్‌పై కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయలేదని ఫైర్ అయ్యారు కేటీఆర్.
ఏ రాష్ట్రంలో జరగని ఘోరం మన రాష్ట్ర సచివాలయంలో జరిగిందన్నారు. 20 శాతం కమీషన్ అడుగుతున్నారు అని కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళన చేశారని ఆగ్రహించారు. గురుకులల్లో చనిపోయిన విద్యార్థుల గురించి మాట్లాడలేదని తెలిపారు. మేము ప్రభుత్వం లో ఉన్నప్పుడు అప్పులు చేశాము అన్నారన్నారు. ఇప్పుడు ఒక్క ఏడాది లో లక్ష 62 వేల కోట్ల అప్పులు తెచ్చారని ఫైర్ అయ్యారు. ఇంత అప్పు చేసినా ఒక్క కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టలేదని…. లక్ష ల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే పట్టించుకునే మంత్రి లేడని విమర్శలు చేశారు.