తెలంగాణకు కలిసి వచ్చే సమయానికి నడిసి వచ్చే కొడుకు కేసీఆర్ – కేటీఆర్‌

-

తెలంగాణకు కలిసి వచ్చే సమయానికి నడిసి వచ్చే కొడుకు కేసీఆర్ అని పేర్కొన్నారు ఎమ్మెల్యే కేటీఆర్‌. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై కేటీఆర్‌ మాట్లాడుతూ… జూన్ 2వ తేదీ 2014లోనే తెలంగాణ రాష్ట్ర నిర్బంధం పోయిందన్నారు. బానిసకోక బానిస అన్నట్టు…పీడించిన వాళ్లకు వారసులు వాళ్ళు అంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కేటీఆర్‌.

కాంగ్రెస్‌ పార్టీకి బీఆర్‌ఎస్‌ పార్టీకి 1.5 శాతం ఓటు తేడా మాత్రమేనని..మిడిసి పడొద్దు ఎక్కువ తేడా లేదని హెచ్చరించారు. గవర్నర్ ప్రసంగం అంత అసత్యాలు, తప్పులే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అసెంబ్లీలో విమర్శించారు. “గవర్నర్ ప్రసంగం విని సభ్యుడిగా సిగ్గుపడుతున్నా. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగు, తాగునీటికి దిక్కు లేదు. విద్యుత్ లేక పంటలు ఎండిపోయాయి. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉండేవి” అని మండి పడ్డారు. పదేళ్ల పాలనపై మాట్లాడమంటే మళ్ళీ గతం గురించి ప్రస్తావించడమేంటని మంత్రి పొన్నం…. కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news