తెలంగాణ అంటే మోదీకి ఎందుకు క‌క్ష : కేటీఆర్‌

-

వనపర్తి జిల్లాలో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ నేడు పర్యటిస్తున్నారు. అయితే.. వ‌న‌ప‌ర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వనపర్తి పదేళ్ల ప్రగతి మహాసభలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. పాలమూరుకు వస్తున్న మోదీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఇవ్వాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కృష్ణా జ‌లాల్లో తెలంగాణ‌కు న్యాయంగా రావాల్సిన 575 టీఎంసీల‌ను కేటాయించాల‌న్నారు. మోదీకి తెలంగాణ అంటే ఎందుకింత క‌క్ష అని ప్ర‌శ్నించారు. వాల్మీకీ బోయలకు ఎస్టీ హోదా కోసం రెండుసార్లు తీర్మానం పంపినా కేంద్రం పట్టించుకోలేద‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ప్ర‌జ‌ల‌ను కేటీఆర్ కోరారు. కేంద్రంలో మన ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పడొద్దన్నారు.

కేంద్రంలో మ‌నం ఉంటేనే మ‌న‌కు రావాల్సిన హ‌క్కులు వ‌స్తాయ‌న్నారు. గులాబీ జెండా ఎగిరే వరకు పాలమూరును పట్టించుకోలేదు. జిల్లాను దత్తత తీసుకున్నోళ్లు కూడా దగా చేశారు. జిల్లా నుండి 14 లక్షల మంది వలసపోతుంటే ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. నది పక్కన నేలలున్నా ఏ ప్రభుత్వం కూడా నీళ్లివ్వలేదు. ఆర్డీఎస్ తూములు పగులగొట్టి నీళ్లు తీసుకుపోతున్నా పట్టించుకోలేదు. అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే హారతులిచ్చి పంపించింది దగుల్బాజీ కాంగ్రెస్ నేతలే అని కేటీఆర్ మండిప‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version