హైదరాబాద్ పై ప్రశంసలు.. ఏపీపై సెటైర్లు వేసిన కేటీఆర్ !

-

జిహెచ్ఎంసి పరిధిలోని చెరువులన్నింటినీ అన్ని రకాల అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో జిహెచ్ఎంసి పరిధిలోని 25, హెచ్ఎండిఏ పరిధిలోని 25 చెరువుల అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న వివిధ నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులకు ఒప్పంద పత్రాలను అందజేశారు మంత్రి కేటీఆర్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ఇంటర్మీడియట్ గుంటూరులో పూర్తి చేసినట్లు చెప్పారు. అయితే గుంటూరులో తనకి ఒక స్నేహితుడు ఉండేవాడని.. అతను హైదరాబాద్ కెనడా కంటే బాగా ఉందని చెప్పాడని తెలిపారు. అయితే తాను లేనిపోని కామెంట్స్ చేయను అంటూనే.. గుంటూరు బాగానే ఉంది, వైజాగ్, విజయవాడ కూడా బాగానే ఉన్నాయి.. నేను వాటి గురించి మాట్లాడను అని సెటైర్లు వేశారు.

ఇక హైదరాబాద్ నగరానికి 440 పైచిలుకు సంవత్సరాల చరిత్ర ఉందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని గుర్తు చేశారు. ఇటీవల హైదరాబాద్ ని సందర్శించిన ప్రముఖులు విదేశాలలో ఉన్నామా అని ఆశ్చర్యపోతున్నారని.. ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకుంటే అంత బాగుంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news