హైదరాబాద్‌ వాసులకు శుభవార్త..త్వరలోనే నిమ్స్ కొత్త బిల్డింగ్ శంఖు స్థాపన

-

2000 పడకల నిమ్స్ కొత్త బిల్డింగ్ కు సీఎం కేసీఆర్‌ త్వరలో శంఖు స్థాపన చేస్తారని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఇవాళ నిమ్స్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎం సి హెచ్ ఆసుపత్రికి భూమి పూజ చేశారు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు, మంత్రి తలసాని. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ…. తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణ కోసం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. ఎం సి హెచ్ ల మీద 490 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. మాతా శిశు మరణాలు తగ్గి దేశం లోనే 3 వ స్థానంలో నిలిచామని తెలిపారు.

మొదటి స్థానం వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం… గర్భిణీ స్త్రీ ఇతర సమస్యలతో బాధపడతారని వివరించారు. రిఫర్ చేస్తే, మార్గ మధ్యలో మరణించడం జరుగుతుంది..సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చెంతకు ఎం సి హెచ్ తెస్తున్నామని ప్రకటించారు. గాంధీలో, అల్వాల్ లో , నిమ్స్ లో మొత్తం 600 పడకల ఎం సి హెచ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నాం.. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అని వివరించారు హరీష్‌ రావు. అధునాతన సౌకర్యాలు మరో 2000 పడకలు నిమ్స్ లో వస్తాయి…పేద ప్రజల కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఎర్రమంజిల్ స్థలం మొత్తం నిమ్స్ కి ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news