TSPSC విచారణ అధికారి శ్రీనివాస్ ఆంధ్రోడు, నిందితుడు ప్రవీణ్ ఆంధ్రోడే అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రశ్నాపత్రాల కుంభకోణంలో కేటీఆర్ నే బాధ్యులుగా చేస్తూ నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నాను…నేరంలో భాగస్వాముల పంపకాల్లో వచ్చిన భేదాల వల్లే ఈ ప్రశ్న పత్రాల కుంభకోణం బయటికి వచ్చిందన్నారు.
ప్రశ్నాపత్రాల కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులను కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలిపారు. TSPSC విచారణ అధికారి శ్రీనివాస్ ఆంధ్రోడు, నిందితుడు ప్రవీణ్ ఆంధ్రోడే అని మరి తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు…!? అని నిలదీశారు.
ఆంధ్రుల అధికారుల నుంచి విచారణను తప్పించాలి… తెలంగాణ అధికారులతో మాత్రమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ కు తెలంగాణ అక్కర్లేకపోవచ్చు, ఇష్టం లేకపోవచ్చు.. కానీ మాకు కష్టం కలిగించవద్దని కోరారు రేవంత్ రెడ్డి. ప్రశ్నించినందుకు మాకు నోటీసులు ఇస్తున్నారు.. దోపిడీ దొంగతనం చేసిన కేటీఆర్ కు సమాచారం ఇస్తున్నారన్నారు. ఇందులో కోట్ల రూపాయల కుంభకోణం, మనీలాండరింగ్ జరిగింది… హవాలాతోపాటు, విదేశాల్లో లావాదేవీలు జరిగాయని తెలిపారు.