బామ్మర్దికి అమృతం పంచారు…అమృత్‌ స్కీం టెండర్లపై కేటీఆర్‌ సంచలనం !

-

బామ్మర్దికి అమృతం పంచారు అంటూ అమృత్‌ స్కీం టెండర్లపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ… బామ్మర్దికి అమృతం పంచారు…శోధా కంపెనీకి అమృత్ ను పoచిపెట్టారన్నారు. రేవంత్ రెడ్డికి బామ్మర్ది కావడమే సృజన్ రెడ్డి అర్హత అన్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ డబ్బులకు రాష్ట్రం టెండర్లు పిలిచింది.. వివరాలు ఎక్కడా లేవు అని నిప్పులు చెరిగారు.

KTR revanth

ముఖ్యమంత్రి బామ్మర్దిని అధికారులు కాపాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి బామ్మర్దికి అమృతం పంచి.. కొడంగల్ వాసులకు ఫార్మా పేరుతో విషం పంచుతున్నారని ఫైర్‌ అయ్యారు. అల్లుడు కోసం కొడంగల్ ను బలి పెడుతున్నారన్నారు. ప్రజల తిరుగుబాటు మొదలయిందని బాంబ్‌ పేల్చారు కేటీఆర్‌. తెలంగాణ లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణ సర్కార్ 300 కోట్ల రూపాయలతో యాడ్స్ ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీ… తెలంగాణకు వచ్చి మహిళలను కలవాలని… వాస్తవాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. మహారాష్ట్రలో చేస్తున్న తెలంగాణ ప్రచారంలో అన్ని అబద్దాలే అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news