ఏపీలో డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ ధరలు పెంచబోతున్నట్లు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత టీడీపీదే అన్నారు. పేదరికం మహా చెడ్డది. మాకు ఇదో పథకం వస్తుందని ప్రజలు ఆశపడ్డారని ఫైర్ అయ్యారు. మంచి చేసిన జగన్ ను కాదని పేదరికం వల్ల నీకు ప్రజలు ఓట్లు వేశారని తెలిపారు.
నిరుద్యోగ భృతి, రైతులకు ఇచ్చే రైతు భరోసా లేదని… బడ్జెట్ లో మహిళ లకు, రైతులకు న్యాయం జరగ లేదన్నారు. ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తావు ?? అంటూ ఫైర్ అయ్యారు. ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే నట్టి నడియెట్లో ముంచారని మండిపడ్డారు. కరెంట్ బిల్లు పెంచము అన్నారు.. కానీ పెంచారు. నిత్యావసర ధరలు పెంచారని నిప్పులు చెరిగారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రజలపై పన్నుల భారం వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ ధరలు పెరగబోతున్నాయని అంటూ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బాంబ్ పేల్చారు.