ఇదొక “చెత్త” సర్కారు అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్త కుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయని మండిపడ్డారు. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయని చురకలు అంటించారు.

బీఆర్‌ఎస్ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు సమీక్షా, సమన్వయ సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవి. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదని మండిపడ్డారు. ప్రజలు ఈసురోమని అలమటిస్తుంటే… పాలకులు మాత్రం “ఆర్ఆర్ ట్యాక్స్” వసూళ్లలో బిజీగా ఉన్నారన్నారు కేటీఆర్.