తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. తాడిపత్రికి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. నారాయణరెడ్డిపల్లి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. శాంతి భద్రతల సమస్య కారణంగా పెద్దారెడ్డిని అడ్డుకున్నట్లు చెబుతున్నారు పోలీసులు.

హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని డీఎస్పీతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. మరోవైపు, తాడిపత్రిలో శివుడి విగ్రహావిష్కరణకు వచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కాగా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నేను ఈ రోజు తాడిపత్రి కి వెళుతున్నాను అని పేర్కొన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి కి ఎవ్వరూ రావద్దని నేను మా కార్యకర్తలు చెప్పానని వెల్లడించారు పెద్దారెడ్డి.
పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదం
తాడిపత్రికి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
నారాయణరెడ్డిపల్లి వద్ద అడ్డుకున్న పోలీసులు
శాంతి భద్రతల సమస్య కారణంగా పెద్దారెడ్డిని అడ్డుకున్నట్లు చెబుతున్న పోలీసులు
హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని… pic.twitter.com/A3tH12ZtPp
— BIG TV Breaking News (@bigtvtelugu) August 18, 2025