రాహుల్ గాంధీ గారూ…రేవంత్ – అదానీ మధ్య ఏంటీ ఆ బంధం? అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ గారూ… మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభం? అదాని – అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనం? అంటూ ఆగ్రహించారు. దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణ గర్జన… తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయింది? అని ఫైర్ అయ్యారు.
కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణభూతమైంది? అంటూ ఫైర్ అయ్యారు. అదాని -అంబానీలపై మీ జంగ్.. రామన్నపేటలో అదాని ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచింది? అని నిప్పులు చెరిగారు. తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే కదా!ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? అని నిప్పులు చెరిగారు. నేను కొట్టినట్లు చేస్తా… నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా? కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా? అంటూ ఆగ్రహించారు. రేవంత్ – అదానీలతో వ్యాపార బంధమా? అని ప్రశ్నించారు. అదాని – అంబానీలపై మీ పోరాటం ఓ భూటకమని… తెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రమన్నారు కేటీఆర్.