Munugode By Poll : ఆ గట్టునుంటావా నాగన్న.. ఈ గట్టుకొస్తావా..? అంటూ కేటీఆర్ ట్వీట్

-

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా అని ఎన్నికల్లో ప్రజలు ఏ వైపునుంటారో తేల్చుకోవాలని ఓ సినిమాలో హీరో పాట పాడతాడు. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు ఏవైపు నుంటారో తేల్చుకోవాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఇదే ప్రశ్న వేశారు.

మునుగోడు ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ, ప్రజలు ఎవరివైపు అంటూ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో ప్రశ్నించారు. ఫ్లోరోసిస్‌ భూతాన్ని నల్గొండ బిడ్డలకు శాపంగా ఇచ్చిన కాంగ్రెస్‌ పక్షానా? ఈ వ్యాధి నిర్మూలనకు నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినా మిషన్‌ భగీరథకు పైసా ఇవ్వని బీజేపీ వైపా? ఫ్లోరోసిస్‌ నుంచి మిషన్‌ భగీరథ ద్వారా శాశ్వత విముక్తి కల్పించిన టీఆర్ఎస్ వైపు ఉంటారా? అని కేటీఆర్ అడిగారు. ఈ మూడు పార్టీల్లో వేటికి పోటీ చేసే అర్హత ఉందో గుర్తించాలని అన్నారు.

వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు దిల్లీలోని ఆయన కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఫ్లోరైడ్‌ బాధిత చిన్నారులను పరిశీలిస్తున్న ఫొటోను ఆయన ట్విటర్‌కు జత చేశారు. ‘‘నాడు స్వయంగా ప్రధానికి మొరపెట్టుకున్నా పైసా ఇవ్వలేదు. సమస్య పరిష్కారం కాలేదు. నేడు కేసీఆర్‌ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని కేంద్రం సైతం పార్లమెంటులో చెప్పింది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version