కేంద్రానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి… తెలంగాణ విద్యార్థుల కోసం స్పెషల్ ఫ్లైట్స్ పంపండి

-

ఉక్రెయిన్- రష్యా పరిణామాలు భారత విద్యార్థులకు ప్రాణ సంకటంగా మారాయి. ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో విద్యను అభ్యసించేందుకు వివిధ రాష్ట్రాలను నుంచి ఉక్రెయిన్ వెళ్తుంటారు. ప్రస్తుతం ఉక్రెయిన్ – రష్యాల మధ్య యుద్ధంతో ఇండియన్స్ ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో 18000 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి చేశారు. ‘‘ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని మేము భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము, తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యార్థుల పూర్తి ప్రయాణ ఖర్చులను భరించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మేము వారిని సురక్షితంగా త్వరగా ఇంటికి తీసుకురాగలరు’’ అంటూ ట్విట్టర్ ద్వారా విదేశాంగ శాఖ మంత్రి జైరాంశంకర్ కు విజ్ఞప్తి చేశారు కేటీఆర్.

ఇప్పటికే తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ శాఖ 24 గంటలు పని చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ కు సరిహద్దుల్లో ఉన్న హంగేరి, రోమానియా సహకారంతో ఇండియన్స్ ను సురక్షితంగా భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version