బోధన్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకిల్ ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. ఇటీవల షకీల్ తల్లి అకాల మరణం చెందింది. ఈ క్రమంలోనే ఆయన్ను పరామర్శించడానికి కేటీఆర్ వెళ్లినట్లు సమాచారం. ఆయన వెంట ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం ఉన్నారు.
హైదరాబాద్‌లోని షకీల్ ఇంటికి వెళ్లి పరామర్శించినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల మాజీ నిజామాబాద్ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి వెళ్లి షకీల్‌ను పరామర్శించి వచ్చారు. ఇదిలాఉండగా, షకీల్ దుబాయ్ నుంచి రాగానే ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.త్వరలోనే ఆయన్ను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.