నేడు వరంగల్ లో కేటీఆర్ పర్యటన.. ఎక్కడికక్కడ విద్యార్థుల అరెస్ట్ ?

-

నేడు వరంగల్ లో కేటీఆర్ పర్యటించనున్నారు. కేటీఆర్ పర్యటనకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.  2176.99 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు ఆయన. నేటి నుంచి ప్రతి రోజు ఇంటింటికి త్రాగు నీటి సరఫరా, దేశాయిపేట లో జర్నలిస్ట్ కాలనీ కి శంకుస్థాపన చేయనున్నారు. నగరానికి తలమానికంగా నిలిచే భద్రకాళి బండ్ ప్రారంభించనున్నారు.

ఉదయం 10.30 నుండి రాత్రి 7.30 వరకు 55 కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అయితే కేటీఆర్ వరంగల్ నగర పర్యటన సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. వరంగల్ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో  బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టులు కూడా చేశారు. అరెస్ట్ చేసిన వారిని నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో తిప్పుతున్నారు వరంగల్ పోలీసులు.  అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు సైతం పోలీసులు లాక్కున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news