సీనియర్ జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్ మృతి

-

సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్ కుల్దీప్ నయ్యర్ బుధవారం అర్థరాత్రి ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన యునైటెడ్ కింగ్డమ్ లో భారత హైకమిషనర్గా పనిచేశారు. బ్రిటీష్ ఇండియాలోని సియోల్ కోట్ లో 1923 ఆగస్టు 14 న ఆయన జన్మించారు. ఉర్దూ పత్రిక అంజమ్ లో జర్నలిస్ట్ గా కేరీర్ ప్రారంభించిన ఆయన ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో జైలుకు కూడా వెళ్లారు.  దేశవిదేశాల్లోని ప్రముఖ పత్రికల్లో కాలమ్స్ రాశారు. జర్నలిస్ట్ గానే కాకుండా మానవ హక్కుల ఉద్యమకారుడిగా, శాంతి కాముకుడిగా ఆయన గుర్తింపు పొందారు.

1990లో యూకేలో హైకమిషనర్ ఆఫ్ ఇండియా స్థాయిలో సేవలందించారు. 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయన రాసిన పుస్తకాల్లో ‘బియాండ్ ది లైన్స్’, ఇండియా ఆఫ్లర్ నెహ్రూ అండ్ అదర్స్, డిస్టెంట్ నైబర్స్: ఎ టేల్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్..తో పాటు ఎమర్జెన్సీ రీటోల్డ్ అనే పుస్తకంలో ఎమెర్జెన్సీ విధించడానకి గల అసలు కారణాలను ఆయన వివరించారు. దిస్టేట్స్ మన్ అనే ఇంగ్లిష్ పత్రికకు ఢిల్లీ ఎడిషన్ ఎడిటర్ గా పనిచేశారు. నాగార్జున యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

న్యూఢిల్లీలోని లోధి రోడ్డులో ఉన్న శ్మశాన వాటికలో  ఈ రోజు మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

నయ్యర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా ఆయనకు నివాళి అర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news