2030 నాటికి చైనాను దాటి జనాభాలో నెంబర్ వన్ గా నిలవనున్న భారత్!

-

ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశం ఏది? అని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు చైనా అని. రెండో దేశం ఏది అని అడిగినా టక్కున చెబుతాడు ఇండియా అని. కానీ.. 2030 సంవత్సరం తర్వాత.. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశం ఏది అంటే ఇండియా అని చెప్పాల్సి వస్తుందట. అవును. షాక్ కాకండి. నిజమే..

2030 నాటికి చైనా కంటే ఒక్కశాతం కాదు రెండు శాతం కాదు ఏకంగా 8 శాతం భారత్ జనాభా ఎక్కువవుతుందట. ఈ విషయాలను చెప్పింది యూఎస్ లోని వాషింగ్టన్ కు చెందిన పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో వెల్లడించింది. దీన్నే పీఆర్బీ అని కూడా అంటారు. తెలుగులో జనాభా లెక్కల కార్యాలయం అన్నమాట.

2018 సంవత్సరానికి గాను ఆ బ్యూరో జనాభా లెక్కలను వెల్లడించింది. 2030 నాటికి భారత్ జనాభా చైనా కంటే 8 శాతం అధికంగా ఉండనుందని కంపెనీ అంచనా వేసింది. 2050 నాటికి చైనా కంటే 25 శాతం అధిక జనాభాను భారత్ కలిగి ఉంటుందని తెలిపింది. నిజానికి ప్రస్తుతం భారత్ జనాభా కంటే చైనాలోనే అధికంగా ఉంది. చైనానే జనాభాలో నెంబర్ వన్. కానీ.. భారత్ త్వరలోనే చైనాను బీట్ చేయనుందని బ్యూరో అంచనా వేస్తున్నది. ప్రస్తుతం భారత్ లో 1.37 బిలియన్ల మంది జనాభా ఉన్నారట. అంటే మన భాషలో చెప్పాలంటే 137 కోట్ల మంది ఉన్నారు. చైనాలో 1.39 బిలియన్ల మంది(139 కోట్లు) ఉన్నారట. అయితే.. 2050 నాటికి చైనా జనాభా 1.34 బిలియన్లకు తగ్గిపోతుందట. భారత్ జనాభా మాత్రం 1.68 బిలియన్లకు(168 కోట్లు) పెరుగుతుందట. దీంతో భారత్ ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుందని పీఆర్బీ అంచనా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news